విశాఖలోని పాత డెయిరీఫాం కూడలిలో ఓ యువకునిపై స్నేహితుడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆరిలోవ టి.ఐ.సి. పాయింట్‌కు చెందిన నిమ్మ ప్రసాద్ ఆటోడ్రైవర్. ఇతనికి పూర్ణ మార్కెట్ దరికల్లుపాకలకు చెందిన కిల్లి ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కిల్లి ప్రసాద్ జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారం రాత్రి నిమ్మ ప్రసాద్‌కు ఫోన్ చేసి మద్యం తాగుదామని రమ్మన్నాడు. తాగాక మత్తులో నిమ్మ ప్రసాద్‌ను దూషించడంతో అతను ఆగ్రహంతో కిల్లి ప్రసాద్ మెడమీద కత్తితో పొడిచాడు. స్థానికులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. నిమ్మ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని క్షతగాత్రుడిని కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఆరిలోవ ఎస్సై గోపాలరావు తెలిపారు.
MURDER ATTEMPT : మద్యం మత్తులో స్నేహితుడిపై హత్యాయత్నం...కేసు నమోదు - విశాఖలో మద్యం మత్తులో కత్తితో దాడి
మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిపైనే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.
![MURDER ATTEMPT : మద్యం మత్తులో స్నేహితుడిపై హత్యాయత్నం...కేసు నమోదు murder attempt in vishakha district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13665971-999-13665971-1637214357670.jpg)
murder attempt in vishakha district