విశాఖ జిల్లా నర్సీపట్నంలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక డిగ్రీ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి.. పోలింగ్ సామగ్రి పంపణీ చేస్తున్నారు. 28 వార్డులకు.. 56 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ పత్రాలు, సామగ్రిని అందజేసి... ఈ రూట్ల వారీగా వాహనాలు కేటాయించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ రోణంకి గోవిందరావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రోణంకి గోవిందరావు మాట్లాడుతూ.. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికల సామగ్రి పంపిణీ - narsipatnam municipal electionsa
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన.. ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో సామగ్రి పంపిణీ చేస్తున్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రి పంపిణీ