విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు స్థానాలకు అధికార వైకాపా కైవసం చేసుకుంది. చైర్మన్ అభ్యర్థిగా బలిఘట్టం వార్డు నుంచి గెలుపొందిన గుదిబండ ఆదిలక్ష్మి ఎన్నిక కాగా.. వైస్ చైర్‌పర్సన్‌గా నర్సీపట్నం వార్డు నుంచి గెలుపొందిన గొలుసు నరసింహమూర్తి ఎన్నికయ్యారు. ఎన్నికల సహాయ అధికారిని, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. స్థానిక పురపాలక కార్యాలయం సమావేశ మందిరంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా.. రెండిటినీ అధికార వైకాపా కైవసం చేసుకుంది. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డుల్లో 14 వార్డులను అధికార వైకాపా కైవసం చేసుకోగా.. తెదేపా 12 వార్డులను దక్కించుకుంది. జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నారు.
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ పూర్తి.. రెండు స్థానాలు వైకాపా సొంతం - Municipal Election in narsipatnam latest news update
నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. చైర్మన్ అభ్యర్థిగా గుదిబండ ఆదిలక్ష్మి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్‌గా గొలుసు నరసింహమూర్తి ఎన్నికయ్యారు. వీరి ఎన్నికను సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య అధికారికంగా ప్రకటించారు.
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ పూర్తి