ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ వ్యయం అంచనా రూ. 15 కోట్లు! - Greater Visakhapatnam Municipal Corporation

విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల నిర్వహణ వ్యయం రూ. 15 కోట్లు వరకూ అవుతుందని అంధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రతిపాదనలను కలెక్టర్ వినయ్ చంద్​కు పంపారు.

gvmc election expenditures
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ. 15 కోట్లు

By

Published : Feb 28, 2021, 7:22 AM IST

మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు రూ. 15 కోట్ల ఖర్చవుతుందని జీవీఎంసీ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్‌ వినయ్ చంద్​కు జీవీఎంసీ కమిషనర్ సృజన పంపారు. మార్చి 10న ఎన్నికలు, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఎన్నికలకు అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్లు ఇతరత్రా అంశాలకు సంబంధించిన ఖర్చుల అంచనాలను జీవీఎంసీ అకౌంట్స్ విభాగం రూపొందించింది. మొత్తం రూ. 15 కోట్లు వరకూ అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

ఇదీ చూడండి:

పోస్కో ఒప్పందంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కే ముప్పు!

ABOUT THE AUTHOR

...view details