మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీపీఐ నారాయణ
విశాఖలోని గాజువాక చినగంట్యాడ 72వ వార్డులో ఎన్నికల ప్రచారంలో.. సీపీఐ నారాయణ పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడితే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుస్తుందన్నారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలు చేసి... దిల్లీలో పాదపూజ చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ
విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని... విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోరారు. నగరంలోని 22వ వార్డులో తెదేపా అభ్యర్థి బొట్ట రమణకు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానికంగా సుపరిచితుడైన బొట్ట రమణను గెలిపిస్తే.. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.
వైకాపాను గెలిపిస్తే.. సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి: జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి