విశాఖపట్నం జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం జీవీఎంసీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేసి జోనల్ కార్యాలయాలకు అందజేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలని, ఫోటో ఓటర్ స్లిప్పులు పంపిణీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలి : కలెక్టర్ వినయ్ చంద్
విశాఖపట్నం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ వి.వినయ్ చంద్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియకు కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్
ఇదీచదవండి.