ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2020, 8:12 AM IST

ETV Bharat / state

'మిలన్' తొలిసారి విశాఖలో...

విశాఖలో మార్చి నెలలో జరగబోయే మిలన్ -2020 నిర్వహణ కోసం నౌకాదళం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. 40కి పైగా దేశాల నుంచి దాదాపు 50 మంది ఈ విన్యాసాలకు హాజరుకానున్నారు.

vishakapatnam
మల్టీ లెటరల్ మారిటైం ఎక్సర్సైజ్ (మిలన్)- 2020

మల్టీ లెటరల్ మారిటైం ఎక్సర్సైజ్ (మిలన్)- 2020 నిర్వహణ కోసం తొలిసారిగా విశాఖ నౌకాదళం సన్నద్ధమవుతోంది. మార్చి నెలలో జరగబోయే ఈ కార్యక్రమానికి దాదాపు 40 దేశాల నుంచి 50 మందికిపైగా విన్యాసాలు చేయడానికి రానున్నారు. కార్యక్రమం వివరాలు కోసం నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ ఒక వెబ్​సైట్ప్రారంభించారు. భారత నౌకాదళం రెండేళ్లకోసారి అండమాన్ నికోబార్ దీవుల్లో 1995 నుంచి విన్యాసాలను నిర్వహిస్తోంది. మొదట కొన్ని దేశాల భాగస్వామ్యంతోనే ప్రారంభమైన ఈ విన్యాసాలు ఇప్పుడు 40కి పైగా దేశాలు పాల్గొనే స్థాయికి చేరింది. ఈ విన్యాసాలు పాల్గొనేందుకుఇప్పటివరకు దాదాపు 22 దేశాలు వరకు తమ సమర్థత తెలియజేశాయి.

'మిలన్' తొలిసారి విశాఖలో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details