విశాఖలో రాష్ట్రస్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. అక్కయ్యపాలెం కల్యాణ మండపంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 190 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 55 కిలోల నుంచి 80 కిలోల పైబడిన విభాగాల్లో తలపడ్డారు. రిఫరీలు అడిగిన భంగిమలు పెడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఏపీ బాడీబిల్డర్ల సంఘం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా.. రాష్ట్ర సంఘం ఛైర్మన్ నాగేశ్వరరావు, ఇతర జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు.
అక్కయ్యపాలెంలో 'మిస్టర్ ఆంధ్ర' బాడీ బిల్డింగ్ పోటీలు - అక్కయ్యపాలెం వార్తలు
విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని కల్యాణ మండపంలో 'మిస్టర్ ఆంధ్ర' బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. 190 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రిఫరీలు అడిగిన భంగిమలు పెడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు.
మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు