విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో.. అధికార పార్టీ వైకాపా ప్రచార దూకుడు పెంచింది. నేటి నుంచి వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి.. వార్డుల వారీగా ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వైభవ వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి.. విశాఖ ఉత్తర నియోజకవర్గ వార్డుల్లో ప్రచారం మెుదలుపెట్టనున్నారని నేతలు తెలిపారు. విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో విజయసాయి ప్రచారం చేస్తారని చెప్పారు.