ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రుణ భారాన్ని ఈక్విటీగా మారిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది' - vijaysai reddy comments on vishaka steel plant

రుణ భారంతోనే స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లోకి వెళ్లిందని.. రుణ భారాన్ని కేంద్రం ఈక్విటీగా మారిస్తే లాభాల్లోకి వస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రావద్దని పోస్కో ప్రతినిధులకు సీఎం స్పష్టంగా చెప్పారని విజయసాయి పేర్కొన్నారు.

mp vijaysai reddy comments on vishakapatnam steel plant  privatization
mp vijaysai reddy comments on vishakapatnam steel plant privatization

By

Published : Feb 20, 2021, 7:49 PM IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైకాపా వ్యతిరేకిస్తోందని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను కార్మికులు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని... పోరాడి సాధించిన స్టీల్‌ ప్లాంట్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో వైకాపా కార్యకర్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పోస్కో ప్రతినిధులతో సీఎం మాట్లాడారు..

"ప్రభుత్వ నిర్ణయాన్ని పోస్కో ప్రతినిధులకు సీఎం స్పష్టంగా చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రావద్దని పోస్కో ప్రతినిధులకు స్పష్టం చేశారు. కడప లేదా కృష్ణపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కడప లేదా కృష్ణపట్నంలో భూములిస్తామని సీఎం.. పోస్కో ప్రతినిధులకు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మిక సంఘాలకు స్పష్టం చేశాం"- విజయసాయి

గనుల సమీకరణ జరగలేదు..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేవని.. ప్రకాశం జిల్లాలో గనులు ఉన్నా ప్రయోజనకరంగా లేవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గనుల సమీకరణకు ఒడిశాకు రూ.1500 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఒడిశా నుంచి ఒక్క టన్ను గనుల సమీకరణ జరగలేదని వెల్లడించారు.

ఈక్విటీగా మారిస్తే లాభాల్లోకి..

"విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.20 వేల కోట్ల రుణభారం ఉంది. రుణాలకు దాదాపు రూ.2,700 కోట్లు వడ్డీ కడుతున్నాం. రుణ భారంతోనే స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లోకి వచ్చింది. రుణ భారాన్ని కేంద్రం ఈక్విటీగా మారిస్తే లాభాల్లోకి వస్తుంది. ఇదే విషయమై ప్రధానికి లేఖలో సీఎం జగన్‌ స్పష్టీకరించారు. ప్రధానికి లేఖలో గనులు, ఈక్విటీ అంశాలపై ప్రస్తావించారు."- విజయసాయి

ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల వ్యక్తులు..

ఉత్పత్తి నిలపకుండా చూడాలని కార్మిక సంఘాలకు సీఎం చెప్పారని.. విజయసాయి తెలిపారు. ఉత్పత్తి నిలిపివేతతో కంపెనీ మరింత నష్టాల్లోకి వెళ్తుందని అన్నారు. స్టీల్‌ ప్లాంటులో ఉన్నతస్థాయిల్లో ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారని..వారికి రాష్ట్ర ప్రయోజనాలపై ఆసక్తి ఉండదని పేర్కొన్నారు. ప్లాంటు ఉన్నతాధికారులు కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల ఉన్నతాధికారుల విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని విజయసాయి రెడ్డి వివరించారు. స్థానిక యువతకు నియామక పరీక్షలో అన్యాయం జరుగుతోందని విజయసాయి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక యువతకు జరిగే అన్యాయంపై ప్రధాని దృష్టికి తెస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి పాదయాత్ర

ఇదీ చదవండి: 'కలసికట్టుగా శ్రమిస్తే.. విశాఖ ఉక్కు పరిశ్రమను మళ్లీ లాభాల బాట పట్టించొచ్చు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details