విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఆధ్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావుతో కలిసి సమగ్ర సర్వే.. జిల్లాలోనే మొదటగా రామయోగి అగ్రహారంలో ప్రారంభించారు. నిజమైన భూ యజమానులకు సమగ్ర సర్వే శాశ్వత పరిష్కారం చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. సర్వే సమయంలో ఉత్పన్నం కానున్న సమస్యలను అధికారులు ఎక్కడికక్కడ పరిష్కరిస్తారన్నారు.
భూ సర్వేతో సమస్యల పరిష్కారం: విజయసాయిరెడ్డి - విశాఖలో సమగ్ర భూ సర్వే ప్రారంభం తాజా వార్తలు
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం రామయోగి అగ్రహారంలో వైఎస్సార్ శాశ్వత భూ హక్కు-భూరక్ష పథకాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. సమగ్ర సర్వేతో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
![భూ సర్వేతో సమస్యల పరిష్కారం: విజయసాయిరెడ్డి భూ సర్వేతో సమస్యల పరిష్కారం: విజయసాయిరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9970515-750-9970515-1608644222418.jpg)
భూ సర్వేతో సమస్యల పరిష్కారం: విజయసాయిరెడ్డి
గత ప్రభుత్వ హయాంలో గ్రామదేవతలకు సంబంధించిన భూములు సైతం దోపిడీదారులు చేతుల్లోకి వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. సమగ్ర సర్వేతో పరిష్కారం లభిస్తుందన్నారు.
ఇదీ చదవండి:విశాఖలో తుపాకుల కలకలం..పోలీసుల ఆరా