ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిపక్షాలకు అధికారం ఇక కలే... 20 ఏళ్లు జగనే సీఎం: విజయసాయిరెడ్డి - వైకాపా విజయసాయిరెడ్డి వార్తలు

విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్హహించిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి తెదేపానేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలన్నది వారికి ఇక కలగానే మిగిలిపోతుందని విజయసాయిరెడ్డి జోస్యం పలికారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిపక్షాలన్నీ అధికారంపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.

MP Vijayasaireddy
ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Jan 8, 2021, 9:37 AM IST

రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం కలయేనని వైకాపా ఉత్తరాంధ్ర ఇన్​ఛార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సుపరిపాలన అందిస్తున్న జగన్ సీఎంగా మరో ఇరవైఏళ్లు ఉంటారని ఆయన అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమంను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​తో కలిసి విజయసాయిరెడ్డి చేపట్టారు.

ప్రజాప్రతినిధులే కారణం

విశాఖ జిల్లా తగరపువలస బంతాట మైదానంలో ఇళ్లస్థలాలు అర్హత పత్రాలు పంపిణీ సభలో తెదేపా నాయకులపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ భూముల రికార్డులు అవకతవకలకు ప్రజాప్రతినిధులే కారణమని విజయసాయిరెడ్డి విమర్శించారు. పట్టాలు లబ్దిదారులు పేరిట ఉన్నప్పటికి వెబ్ ల్యాండ్​లో నచ్చిన వాళ్ల పేర్లు మార్చుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఎంపీ ఆరోపించారు.

ఇదీ చదవండి:

ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి

ABOUT THE AUTHOR

...view details