చిన్నప్పుడు అక్షరాలు దిద్ది.. విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలకు ఎంపీ హోదాలో రావడం చాలా సంతోషంగా ఉందని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా మాడుగుల ఆర్సీఎం బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన వాలంటీర్లకు పురస్కారాల పంపిణీ సభకు ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్నప్పుడు చదువుకున్న ఆర్సీఎం పాఠశాలలో అప్పట్లో తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి తిరిగారు. పాఠశాలలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతిని ఉపాధ్యాయులు సత్కరించారు. ఆమెకు అప్పట్లో చదువు నేర్పిన గురువులను ఎంపీ సన్మానించారు.
విద్యార్థిగా వెళ్లి...ఎంపీగా వచ్చా: ఎంపీ సత్యవతి - విశాఖ జిల్లా తాజా వార్తలు
అక్షరాలు దిద్దిన పాఠశాలకు ఎంపీ హోదాలో రావడం సంతోషంగా ఉందని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా ఆర్సీఎం పాఠశాలలో తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను కలిశారు.
ఆర్సీఎం పాఠశాలలో ఎంపీ సత్యవతి