కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి. సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
రోగులకు మెరుగైన సేవలందించేందుకు వైద్య సిబ్బంది కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ ఎంపీని కోరగా.. సిబ్బంది సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఎలాంటి చికిత్స అందించాలన్నదానిపై వైద్యులకు స్పష్టత ఉందని.. కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆమె భరోసానిచ్చారు.