ప్రతి ఒక్కరూ అపోహలు వీడి... రక్తదానం చేయాలని... విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కేజీహెచ్‌లో కూలర్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసి మరో నలుగురితో చేయించాలన్నారు. దేశంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సరిపడా రక్తపు నిల్వలు పెరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా సభలు సమావేశాల్లో ఇదే విషయాన్ని చెబుతానని, ఆచరిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేయండి... ప్రాణాలను నిలబెట్టండి..! - విశాఖ జిల్లాలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రక్తదానం
విశాఖ జిల్లాలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ అపోహలు వీడి... రక్తదానం చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.

విశాఖ జిల్లాలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో రక్తదానం చేసిన ఎంపీ సత్యనారాయణ