SMUGGLING MARJUANA THROUGH AMAZON: విశాఖ కేంద్రంగా మధ్యప్రదేశ్‌కు గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో బెండీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఆ మేరకు విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు.. అమెజాన్ ఆన్‌లైన్ స్టోర్‌లో పని చేస్తున్న కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణలను అరెస్టు చేశారు. గంజాయి సరఫరా చేసే శ్రీనివాస్‌ను పట్టుకున్నారు.
GANJA SMUGGLING IN AMAZON: 'అమెజాన్' ద్వారా గంజాయి స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్ - ap 2021 news
విశాఖ కేంద్రంగా అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు సభ్యులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న శ్రీనివాస్‌తో పాటు ఆన్‌లైన్ స్టోర్ ఉద్యోగులు కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణలను అదుపులోకి తీసుకున్నారు.
'అమెజాన్' ద్వారా గంజాయి స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్