ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంబసింగి అభివృద్ధికి మరిన్ని చర్యలు: ఎంపీ మాధవి - అరకు ఎంపీ మాధవి తాజా వార్తలు

విశాఖ జిల్లాలోని పర్యటకంగా అభివృద్ధి చెందుతున్న లంబసింగి ప్రాంతంలో.. సాగవుతున్న స్ట్రాబెర్రీ తోటలను అరకు ఎంపీ గొట్టేటి మాధవి సందర్శించారు. స్ట్రాబెర్రీ సాగులో మెళకువలపై రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.

mp-madhavi-visit-straa-berry-plantaions-at-lambasing-in-visakhapatnam-district
లంబసింగిలోని స్ట్రాబెర్రీ తోటలను సందర్శించిన ఎంపీ మాధవి

By

Published : Feb 7, 2021, 3:28 PM IST

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో సాగవుతున్న స్ట్రాబెర్రీ తోటలను అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి సందర్శించారు. స్ట్రాబెర్రీ సాగులో మెళకువలపై ఎంపీ ఆరా తీశారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్న పెట్టెలను పరిశీలించిన మాధవి.. రైతులతో కలిసి స్వయంగా ప్యాకింగ్ చేశారు.

మన్యంలో పండుతున్న స్ట్రాబెర్రీ ప్రాధాన్యతను ఇటీవలే ముఖ్యమంత్రికి వివరించానని ఎంపీ చెప్పారు. స్ట్రాబెర్రీ రైతులకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న లంబసింగిని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details