చెన్నై-విశాఖ రైళ్ల (02008, 02870) సమయాల్లో మార్పులు చేయాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తెలిపారు. ఈ మేరకు దక్షిణ రైల్వే జీఎంకు ప్రత్యేకంగా లేఖ రాశారు. రైల్వేలో కొత్తకాల పట్టిక అమలు చేయకముందు ఈ రెండు రైళ్లూ చెన్నై నుంచి రాత్రిపూటే బయల్దేరేవని.. అప్పుడు 100శాతం ఆక్యుపెన్సీతో నడిచేవని గుర్తు చేశారు. కానీ తాజాగా వీటిని పగటి సమయాలకు మార్చడంతో ఆక్యుపెన్సీ రేషియో దారుణంగా పడిపోయిందని, ప్రస్తుతం 50శాతం కూడా లేదన్నారు. కాబట్టి ప్రజల సౌకర్యానికి అనుగుణంగా రాత్రి సమయాలకు మార్చాలని కోరారు. అలాగే ఆ రైళ్లను చెన్నై నుంచి కాట్పాడి మీదుగా ఈరోడ్ రైల్వేస్టేషన్ దాకా పొడిగించేలా చర్యలు తీసుకోవాలని రాశారు.
చెన్నై-విశాఖ రైళ్ల సమయాల్లో మార్పులకు దక్షిణ రైల్వే జీఎంకు ఎంపీ మాధవి లేఖ - araku mp madhavi latest news
దక్షిణ రైల్వే జీఎంకు అరకు ఎంపీ మాధవి లేఖ రాశారు. చెన్నై - విశాఖ రైళ్ల సమయాల్లో మార్పులు చేయాలని అందులో పేర్కొన్నారు.
దక్షిణ రైల్వే జీఎంకు ఎంపీ మాధవి లేఖ