కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకులోయ ఎంపీ మాధవి దోమ తెరలు పంపిణీ చేశారు. విశాఖ మన్యంలో దోమల కారణంగా వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ముందస్తుగా దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ కాలంలో దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ దోమతెరలు అందజేశామని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఇంటా దోమ తెరలు వినియోగించి ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ మాధవి ప్రజలను కోరారు.
విశాఖ మన్యంలో దోమతెరల పంపిణీ - విశాఖ జిల్లా మన్యం తాజా వార్తలు
దోమల కారణంగా వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తగా ఎంపీ మాధవి విశాఖ మన్యంలో దోమ తెరలు పంపిణీ చేశారు. ప్రజలంతా అనారోగ్యాల భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చారు.
మన్యంలో వ్యాధులు ప్రభలకుండా దోమతెరలు పంపిణీ