విశాఖ మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కరోనా లాక్డౌన్ కారణంగా గిరిజనులు సంతలు లేక, నిత్యావసరాలు దొరకక, ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీ మాధవి తన సొంత డబ్బులతో ఎనిమిది వందల మందికి సరిపోయే 15 రకాల నిత్యావసరాలు ప్రత్యేకమైన వాహనంలో పంపించారు. చింతపల్లి మండలంలోని కుగ్రామాలైన కోరుకొండ, బలపం పంచాయతీల గ్రామాలకు స్థానిక కార్యకర్తల ద్వారా ఇంటింటికి ఈ నిత్యావసరాలు అందజేశారు. కొంత నగదు ఇచ్చి అవసరం ఉంటే ఖర్చు చేయాలని సూచించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ మాధవి - mp madhavi latest news update
అరకులోయ ఎంపీ మాధవి చింతపల్లి మండలం కోరుకొండ, బలపం పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. లాక్డౌన్ కారణంగా అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన ఆమె సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన నిత్యావసరాలను వారికి పంపిణీ చేశారు.
ఎంపీ మాధవి నిత్యావసరాలు పంపిణీ
ఇవీ చూడండి...