విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వెలగలపాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ మాధవి సందడి చేశారు. పేదలకు వస్త్రదానం చేశారు. సంక్రాంతి పండుగ గిరిజన సాంప్రదాయాలకు ప్రతీక అని, సాంకేతిక పరంగా దేశం ముందడుగు వేస్తున్నా మన సంప్రదాయాలు మరిచిపోకూడదని అన్నారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన భజన, కోలాటం, చెట్టుభజన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కోలాటంలో గిరిజనులతో కలిసి ఎంపీ మాధవి చిందేశారు.
గిరిజనులతో కలిసి ఎంపీ మాధవి 'సంక్రాంతి చిందు' - విశాఖ మన్యంలో సంక్రాంతి సంబరాలు తాజా వార్తలు
విశాఖ మన్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కొయ్యూరు మండలం వెలగలపాలెంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ మాధవి పాల్గొన్నారు. పేదలకు వస్త్రదానం చేశారు. గిరిజనులతో కలిసి చిందేశారు.
![గిరిజనులతో కలిసి ఎంపీ మాధవి 'సంక్రాంతి చిందు' mp madhavi celabrate sankranth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5719760-828-5719760-1579100461541.jpg)
గిరిజనులతో కలిసి చిందేసిన ఎంపీ మాధవి