మన్యం ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు అరకు ఎంపీ మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. దిల్లీలో శుక్రవారం రవాణా, పర్యాటక, సంస్కృతి కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. గిరిజన ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతిని నేటి తరానికి తెలియజేసేలా కార్యాచరణ చేపట్టాలని కమిటీ ఛైర్మన్‌ను కోరినట్లు పేర్కొన్నారు.
'మన్యం ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించండి' - MP Madhavi comments on tribal tradition
మన్యం ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు అరకు ఎంపీ మాధవి తెలిపారు. గిరిజన సంస్కృతిని నేటి తరానికి తెలియజేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు వివరించారు.
!['మన్యం ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించండి' MP Madhai Request for additional funds for tribal welfare](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8774916-701-8774916-1599904146843.jpg)
అరకు ఎంపీ మాధవి