రాష్ట్రంలో అప్పులు చేసే పరిస్థితి తప్ప అభివృద్ధి కనిపించట్లేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం నడుస్తోందన్నారు. కేంద్రం చేసే అభివృద్ధిని కూడా తామే చేసుకున్నట్లు చెబుతున్నారని విమర్శించారు. సినిమా టికెట్లే కాదు... రేపు సినిమాలను కూడా ప్రభుత్వమే తీస్తుందేమోనని ఎద్దేవా చేశారు. తాము కేవలం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం నడుస్తోంది: ఎంపీ జీవీఎల్ - ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో అభివృద్ధి కనిపించట్లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేవలం అప్పులు చేసే పరిస్థితే కనిపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో నడుస్తోందన్నారు.
MP GVL