ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MP GVL: 'వైజాగ్​ ఈఎస్​ఐ ఆసుపత్రి నిర్మాణానికి రూ.390 కోట్లు మంజూరు' - esi

MP GVL on ESI Hospital: విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 390 కోట్లు మంజూరైనట్లు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు చేపడతారన్నారు.

ఎంపీ జీవీఎల్​
MP GVL

By

Published : Jan 27, 2022, 10:28 PM IST

MP GVL on ESI Hospital: విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఎంప్లాయీస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ), కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ.. రూ. 390 కోట్లు మంజూరు చేసినట్లు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గురువారం జరిగిన ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు జీవీఎల్‌ పేర్కొన్నారు.

సీపీడబ్ల్యూడీ ద్వారా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపడతారని ఎంపీ తెలిపారు. జనవరి 4, 5 తేదీల్లో వీఎంసీ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌తో.. ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పౌర సేవలపై సమీక్షించినట్లు జీవీఎల్ వెల్లడించారు. ఈమేరకు జీవీఎల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details