రాష్ట్రానికి రావల్సిన నిధులపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖలో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరు మినహా ఆ రూపేణా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వివిధ రూపాలలో మోదీ ప్రభుత్వం అందించిందన్నారు. ప్రధాని అవాస్ యోజన కింద మన రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు వచ్చాయని.. అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి తక్కువ నిధులు కేటాయించారన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం తమ పథకాలుగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. బీహార్లో భాజపా గెలవడానికి ప్రధాన కారణం ఉజ్వల పథకమని .. పశ్చిమ బంగాలో కూడా ఉజ్వల పథకం వల్ల ఎక్కువగా లబ్ది పొందుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 32 పారిశ్రామిక కారిడార్లు ఉంటే అందులో ఐదు కారిడార్స్ ఏపీకి ఉన్నాయన్నారు. తూర్పు తీర ప్రాంతం అంతా అభివృద్ది చెందాలన్నదే లక్ష్యమని ఆయన అన్నారు. కోటి 43 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఈ కారిడార్ల వల్ల ఉన్నాయని చెప్పారు. 18 ఎలక్ట్రానిక్ కారిడార్స్ ఇస్తే రాష్ట్రానికి మూడు క్లస్టర్లు ఇచ్చారని చెప్పారు.
ప్రత్యేక హోదా పేరు తప్ప.. ఆ రూపేణా చాలానే నిధులొచ్చాయ్..! - భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజా వార్తలు
మోదీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో దాదాపు రెండు లక్షల 34 వేల కోట్ల రూపాయిల మొత్తాన్ని రాష్ట్రానికి వివిధ పద్దుల కింద విడుదల చేసిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరు మినహా ఆ రూపేణా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వివిధ రూపాలలో అందించిందన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయామన్నది వాస్తవమని ఆయన విశాఖలో అంగీకరించారు.
రెవెన్యూ లోటు కింద ఎక్కువగా ఏపీకి కేంద్ర నిధులు వచ్చాయని ఆయన అన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ ద్వారా గత ఐదేళ్లలో చాలా కంపెనీలు ఏర్పాటయ్యాయన్నారు. కేంద్రం ప్రత్యేకంగా మౌలిక వసతులు మాత్రమే ఏర్పాటు చేస్తోందని.. మరో 8 లక్షల 17 వేల కోట్లు రాష్ట్రానికి రానున్నాయన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా -జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి ఉంటారని, మా మిత్రునితో దోస్తీ మంచి ఫలితాలను ఇస్తోందని వివరించారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పలుమార్లు కమిటీ సమావేశం అయ్యిందని అన్నారు. జమిలీ ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉందని వివరించారు. కోస్తా పర్యాటకం పై మరిన్ని ప్రణాళికలు కేంద్రం సిద్ధం చేస్తోందన్నారు.
ఇదీ చూడండి.పురపాలక ఎన్నిక పోరు: ఏకగ్రీవాలు, బుజ్జగింపులు