సమాజ ప్రగతిలో జర్నలిస్టులు పాత్ర ప్రశంసనీయమని.. వారు నిరంతర శ్రామికులు అని మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ ఇండియా అధినేత జేవీ ప్రభాకర్ అన్నారు. విశాఖలోని డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో పలువురు జర్నలిస్టులకు కొవిడ్ మందులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొవిడ్ కిట్ పంపిణీ - covid Kit distribute to Journalists
విశాఖలోని డాబా గార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులకు కొవిడ్ మందులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
![మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొవిడ్ కిట్ పంపిణీ జర్నలిస్టులకు కొవిడ్ కిట్ పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:10:10:1621780810-ap-vsp-61-23-moving-minds-covid-protection-kit-distibution-av-ap10150-23052021200916-2305f-1621780756-161.jpg)
Distribute of covid Kit to Journalists at Visakhapatnam
ఈ సంస్థ ద్వారా గత ఏడాది కరోనా సమయంలోనూ నిరుపేదలకు సుమారు రూ. 10 లక్షలు విలువైన నిత్యవసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేశామని ప్రభాకర్ గుర్తుచేశారు. ఈ ఏడాది ఇప్పటికే పది వేల మందికి చేయూత ఇచ్చామని, తాజాగా కొంతమంది జర్నలిస్టులకు సాయం చేశామని.. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సంస్థ అధినేత జేవి ప్రభాకర్ అన్నారు.
ఇదీ చదవండి..రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు