విశాఖ నగరానికి చెందిన రచయిత్రి, గాయని శ్రీసాయి, సరిగమప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొండుగారి హర్షవల్లికి మదర్ థెరిసా జాతీయ మహిళా రత్న అవార్డు లభించింది. ఎంతో మంది పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, వీధిబాలలకు, యాచకులకు నిస్వార్థంగా సేవలు అందించినందుకుగాను వీరికి ఈ అవార్డు దక్కింది. హర్షవల్లికి ఈ అవార్డు లభించడంపై ట్రస్టు వ్యవస్థాపకులు అశోక్‌తో పాటు, పలువురు రచయితలు హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు.
విశాఖ వాసులకు మదర్ థెరిసా జాతీయ మహిళా రత్న అవార్డు - విశాఖ వ్యక్తులకు మదర్ థెరిసా జాతీయ మహిళా రత్న అవార్డు
విశాఖకు చెందిన ఇద్దరు ప్రముఖులకు మదర్ థెరిసా జాతీయ మహిళా రత్న అవార్డు లభించింది. నిస్వార్థంగా సేవలను అందించిన కారణంగా వీరికి ఈ అవార్డు దక్కింది.
![విశాఖ వాసులకు మదర్ థెరిసా జాతీయ మహిళా రత్న అవార్డు Mother Theresa National Womens Award](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11118496-245-11118496-1616461510840.jpg)
విశాఖ వాసులకు మదర్ థెరిసా జాతీయ మహిళా రత్న అవార్డు