విశాఖ జిల్లా చిన్న వాల్తేరు విద్యానగర్‌లో దారుణం జరిగింది. ఒమ్మి పొలారావు అనే వ్యక్తి నిత్యం మద్యం తాగి తల్లి, భార్య, సోదరిని వేధించేవాడు. తన జీతంతో పాటు తల్లికి వచ్చే పింఛన్‌ను కూడా తీసుకునేవాడు. ఈ నెల 7వ తేదీ రాత్రి మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. తల్లి, భార్యపై దాడి చేశాడు. అతని హింస భరించలేని కుటుంబ సభ్యులు కడతేర్చాలని అనుకున్నారు.
నిత్యం తాగొచ్చి హింసించాడు..అయినవాళ్ల చేతుల్లోనే హతమయ్యాడు - విశాఖలో కన్న కోడుకును హతమార్చిన తల్లి
కొడుకు పెట్టే హింసను భరించలేక కన్నతల్లే తనయుడిని హతమార్చిన ఘటన విశాఖ జిల్లా చిన్నవాల్తేరులో జరిగింది. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను నమ్మించాలనుకున్నారు. కానీ పోలీసులు విచారించి అసలు నిందితులను అరెస్ట్ చేశారు.
![నిత్యం తాగొచ్చి హింసించాడు..అయినవాళ్ల చేతుల్లోనే హతమయ్యాడు కన్నకోడుకున హతమార్చిన తల్లి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6441739-387-6441739-1584453586445.jpg)
రాత్రి ఒంటి గంట సమయంలో సోదరి, తల్లి, అతని బావమరిది కిషోర్ పొలారావుపై దాడి చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులను నమ్మించారు. దర్యాప్తులో పోలీసులకు అనుమానం వచ్చింది. ఘటన తర్వాత నిందితులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవడం...పోస్టు మార్టం నివేదిక భిన్నంగా రావటంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. ముగ్గురూ నేరం అంగీకరించారు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, కుటుంబ సభ్యులను హింసించడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.