ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్లముందే పిల్లను కోల్పోయిన తల్లి శునకం.. మూగ రోదన

కళ్లముందే బిడ్డను కోల్పోయిన ఓ తల్లి శునకం మూగ రోదన మనసులను కదిలించిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో కనిపించింది. కడపు కోతకు గురైన తల్లి...కుక్కపిల్ల మృతదేహం వద్దే విచారంగా ఉండిపోయింది. ఎప్పటికైనా లేస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ గడిపింది.

mother-dog
mother-dog

By

Published : Jul 20, 2020, 11:55 AM IST

Updated : Jul 20, 2020, 12:16 PM IST

కళ్లముందే పిల్లను కోల్పోయిన తల్లి శునకం.. మూగ రోదన

కళ్లముందే పిల్లను కోల్పోయిన ఓ తల్లి శునకం మూగ రోదన మనసులను కదిలించింది. విశాఖ జిల్లా పాడేరులో అప్పటివరకూ చెంగుమంటూ తిరిగిన ఓ కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. టైరు చక్రాల కింద నలిగిపోయిన ఆ చిరు జీవి, క్షణాల్లో విగత జీవిగా మారింది. ఊహించని విషాదంతో కడుపు కోతకు గురైన తల్లి.. కుక్కపిల్ల మృతదేహం వద్దే విచారంగా ఉండిపోయింది. ఎప్పటికైనా లేస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ గడిపింది. చెవులు కొరికి లేపేందుకూ ప్రయత్నించింది. తెల్లార్లూ కంటికి కునుకు లేకుండా రోడ్డుపైనే ఎదురు చూసిన దృశ్యం స్థానికులను కలచివేసింది.

Last Updated : Jul 20, 2020, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details