విశాఖ మన్యం హుకుంపేట మండలం దాలిగుమ్మడిలో సత్యవతి(26) అనే మహిళ గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వారు పొలం పనుల కోసం బయటకు వెళ్లగా... సత్యవతి ఏడాది వయసున్న తన చంటిబాబుని నిద్రపుచ్చి... ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. భర్త వచ్చి ఆమెను హుకుంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పారు. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చంటిబాబు లేచేసరికి అమ్మ కనిపించలేదు. ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడ్చాడు. చిన్నారి బాధను చూసి బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిన్నారిని నిద్రపుచ్చి... తల్లి శాశ్వత నిద్రలోకి..! - చిన్నారిని నిద్రపుచ్చి... తల్లి శాశ్వత నిద్రలోకి..!
తన కుమారుడిని లాలించి నిద్రపుచ్చిన తల్లి... అనంతరం బలవన్మరణానికి పాల్పడింది. ఇది తెలియని ఆ చిన్నారి... నిద్ర లేచిన వెంటనే తన అమ్మ కోసం వెతికాడు. బంధువులు ఓదార్చేందుకు ప్రయత్నించినా ఏడుస్తూనే ఉన్నాడు. ఈ హృదయ విదారక ఘటన విశాఖ మన్యంలో జరిగింది.
చిన్నారి
Last Updated : Dec 26, 2019, 5:18 PM IST
TAGGED:
mother dead after son sleep