పిల్లల ఆలనా పాలనా చూసే తల్లులకు.. కరోనా కారణంగా మరో పని వచ్చి పడింది. లాక్‌డౌన్ కారణంగా బార్బర్ షాపులు మూతపడ్డాయి. 3 నెలలుగా పిల్లలకు క్షవరం లేక జుట్టు ఒత్తుగా పెరిగిపోయింది. చేసేది లేక.. ధైర్యం చేసి తమ తల్లులే కత్తెర్లు పట్టుకుని పిల్లల వెంట్రుకలు కత్తిరిస్తున్నారు.
పిల్లల జుట్టును.. తల్లులే కత్తిరిస్తున్నారు! - విశాఖ వార్తలు
తల్లులే పిల్లల తల వెంట్రుకలు కత్తిరించాల్సిన పరిస్థితి వచ్చింది. లాక్ డౌన్ కారణంగా కటింగ్ షాపులు తెరవకపోవడమే ఇందుకు కారణమవుతోంది.
Mother son
విశాఖ ఏజెన్సీ కేంద్రం.. పాడేరుకు ఆనుకుని ఉన్న ముళ్ళు మెట్ట గ్రామంలో శాంతి అనే మహిళ తన కుమారుని వెంట్రుకల కత్తిరిస్తూ కనిపించింది. కరోనా కారణంగా బార్బర్ షాపులకు పిల్లలను తీసుకు వెళ్లడం లేదని చెప్పింది. అందుకే.. తమ పిల్లలకు తామే వెంట్రుకలు కత్తిరిస్తున్నామని తల్లులు అంటున్నారు.