విశాఖ జిల్లా మన్యం కొండల్లో డోలి చావులు ఆగడం లేదు. మంగళవారం ఓ తల్లి, బిడ్డ ప్రాణాలు వదిలారు. జి. మాడుగుల మండలం గిల్లిబారులో నెలలు నిండిన గర్భిణికి నొప్పులు వచ్చాయి. స్థానికులు డోలిలో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే శిశువుకి జన్మించింది. కానీ ఆ చిన్నారి కళ్లు తెరవకముందే శాశ్వతంగా కళ్లు మూసింది. అంతలోనే తల్లి కూడా డోలీలోనే మృత్యుఒడిలోకి చేరింది. ఈ విషాధ ఘటనతో మన్యం గిరిజనులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లీబిడ్డ మృతదేహాలను తిరిగి అదే డోలీలో స్వగ్రామం తరలించి.. చివరి మజిలీ నిర్వహించారు.
మన్యం కొండల్లో పుట్టినందుకు చావాల్సిందేనా..! - ఏపీలో డోలీ వార్తలు
కొండలు , కోనలు దాటి డోలీలో ఓ గర్భిణి పురిటినొప్పులు పడుతూ.. అమ్మగా మారే క్షణం కోసం ఎదురుచూస్తోంది. కొద్దిసేపటికి నొప్పుల బాధ భరించలేక ..ఆ తల్లి మార్గమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అమ్మగా అనుభూతిని అస్వాదించాలి అని అనుకుంటుండగా ..పుట్టిన శిశువు కళ్లు తెరవకముందే కన్నుమూసింది. ఆ చిన్నారిని చూడలేక కొన్ని క్షణాల్లోనే తల్లి మరణించింది. అదే డోలీలో తల్లి, బిడ్డ మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లారు స్థానికులు.
క్షణాల వ్యవధిలోనే శిశువు, తల్లి మృతి
రెండు రోజుల క్రితం చింతపల్లి మండలం కుడుముసార పంచాయతీ కరకపల్లిలో గర్భిణి డోలీలో ప్రసవమై.. శిశువు మృతి చెందింది. ఇప్పటికైనా ప్రభుత్వం కొండ గ్రామాలలో రహదారులు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చూడండి.విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి