తపాలశాఖ మారుమూల చిట్టచివరి గ్రామాన్ని కూడా ఈశాఖ సృశించి.. తన సేవలను అందిస్తోంది. విస్తృతమైన నెట్ వర్క్ ఉన్న ఈ శాఖ కాలానుగుణంగా వస్తున్న ఆనేక మార్పులకు లోనవుతూనే ఉంది. స్టాంపులు, కవర్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల చారిత్రక ఘటనలు, ప్రదేశాలు, గొప్పవ్యక్తుల గురించి తెలుసుకునేందుకు వ్యాప్తి చేసేందుకుఒక మార్గంగా ఉండేది. వీటి సేకర్తలకు ఎప్పుడు ఈ తరహా కవర్లు,స్టాంపులు వస్తాయన్నది నిత్యం ఆసక్తికరంగానే ఉంటుంది.
సాంస్కృతిక అనవాళ్లకు చిరునామా.. తపాలాశాఖ! - విశాఖ తపాలా స్టాంపులు
విభిన్న సంస్కృతులు, చారిత్రక ఆనవాళ్లకు, రకరకాల ఆహార రుచులకు మన దేశం పుట్టినిల్లుగా చెప్పాలి. వీటిని పదిల పరుచుకుని తర్వాత తరాలకు అందించేందుకు చరిత్రకారులు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భారత తపాలా శాఖ గుర్తులను.. సమాజానికి తెలపడంలో ఎప్పుడూ ముందుంటుంది. విశాఖ తపాలా శాఖ వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతులను చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉంచే విధంగా తపాలా బిళ్లలు, ప్రత్యేక కవర్లు, స్టాంపులను విడుదల చేస్తోంది.
ఇప్పుడు కమ్యూనికేషన్ విస్తరించడం వల్ల తపాలా శాఖ ప్రభకు మసకబారినా, వివిధ స్ధాయిల్లో కవర్లను, స్టాంపులను, ఘటనలను, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, చారిత్రక ఘటనలు వంటి వాటికి దర్పణంగా నిలిచేట్టుగా స్పెషల్ కవర్లను, బొమ్మలతో ఉన్న కార్డులను విడుదల చేస్తూ వస్తోంది. దీనిని ఇటీవల కాలంలో మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో పలు చారిత్రక ఘటనలను కార్డులు,కవర్లు, ప్రత్యేక కవర్లద్వారా రికార్డు చేస్తోంది.
ఇదీ చూడండి.రాష్ట్రస్థాయి పదవి ఉన్నా.. నిలువ నీడ లేదు..!