అనకాపల్లిలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న కారణంగా అధికారులు కరోనా పరీక్షలు ముమ్మరం చేశారు. దీంతో నగరంలోని రెడ్ జోన్ పరిధిలో ఉన్న వారికి పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గవరపాలెంలోని వీజే నాయుడు వీధి, దాసరి గెడ్డ రోడ్డు, విల్లురి జోగి నాయుడు వీధి, నీలకంఠ రావు వీధి, చిన రామ స్వామి కోవెల, కోటవీధి ప్రాంతాల వారికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో కంటెన్మెంట్ పరిధిలోని వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారు అనకాపల్లిలోని కొట్ని వీధి కళ్యాణ మండపం, ప్రధాన రహదారిలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొబైల్ వాహనంతో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
అనకాపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు - more corona tests in anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో మంగళవారం మరో ఎనిమిది మందికి కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కంటెన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
రెడ్‌జోన్ పరిధిలో వారికి కరోనా పరీక్షలు