కారులో తరలిస్తున్న నగదును అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన నరేందర్ రెడ్డి విజయనగరం జిల్లా రామభద్రపురం నుంచి కారులో వస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. డిక్కీలో రూ.ఐదు లక్షల నగదు దొరికింది. ఎలాంటి ఆధారాలు చూపకపోడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై ధనుంజయ్ తెలిపారు. నగదును రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.
కారులో రూ.5 లక్షలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు - విశాఖలో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత న్యూస్
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు వద్ద కారులో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు చూపలేదని పోలీసులు తెలిపారు.
![కారులో రూ.5 లక్షలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు కారులో 5 లక్షలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9799085-155-9799085-1607356268268.jpg)
కారులో 5 లక్షలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు