జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు.... - విశాఖ
విశాఖజిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. వివిధ కారణాల రీత్యా ఆరుగురు సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఓఎస్డి కార్యాలయంలో ఒక దళ సభ్యుడు ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. అదనపు ఎస్.పి బి కృష్ణారావు ఎదుట జనజీవన స్రవంతిలో కలిశారు. వీరు పెదబయలు జి.మాడుగుల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో కృష్ణ అనే వ్యక్తి పెదబయలు దళం ఏరియా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటవాసి కృష్ణ. 2012లో జి.మాడుగుల వద్ద ఎదురుకాల్పులు, 2015లో ఒడిశా సమీపంలోని ఎదురుకాల్పులు ఎస్సార్ పైపులైను ధ్వంసం చేయడం తదితర నేరాలతో వీళ్లకు సంబంధం ఉన్నట్లు అదనపు ఎస్.పి వివరించారు.