పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఆదర్శ పాఠశాలల్లో.. ఇంటర్ ప్రవేశానికి గడువు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ దరఖాస్తుల కోసం గత నెలాఖరుతో గడవు ముగియగా.. దరఖాస్తు గడువును ఆగస్టు 25 వరకు పెంచినట్లు స్పష్టం చేశారు.
ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు - ఆదర్శ పాఠశాల ఇంటర్ దరఖాస్తు గడవు
ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
ఇంటర్ మెుదటి ఏడాదిలో ప్రవేశానికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయనీ.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుననీ.. చీడికాడ ఏపీ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ హీరాలాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు ఉండగా... విశాఖ జిల్లాలో చీడికాడ, రావికమతం, నర్సీపట్నం, కశింకోట, మునగపాక మండలాల్లో ఆదర్శ పాఠశాలలుఉన్నట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందనీ.. బాలికలకు ప్రత్యేకంగా వసతి గృహ సదుపాయం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:హిందుస్థాన్ షిప్ యార్డు ఘటనపై చంద్రబాబు, లోకేశ్ విచారం