రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఈ తరహా పాఠశాలలు విశాఖ జిల్లాలో చీడికాడ, నర్సీపట్నం, రావికమతం, కసింకోట, మునగపాక మండలాల్లో మాత్రమే ఐదు ఉన్నాయి. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధన ఉంటుంది. బాలికలకు ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేశారు. ఆదర్శ పాఠశాలలో 2020-21 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని.. దరఖాస్తు రుసుము ఓసి, బీసి విద్యార్థులకు రూ.వంద, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలన్నారు. ప్రవేశాలు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ప్రకటిస్తామని చీడికాడ ఏపీ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ హీరాలాల్ తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు ఉందని తెలిపారు.
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - ఏపీ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు ఉందని అధికారులు వెల్లడించారు. ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
model school