మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓంప్రకాష్ మృతి చెందాడు.ఈ మేరకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రి ఓం ప్రకాష్‌కు శ్వాస సమస్య వచ్చిందని జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారని చెప్పారు. మూత్రపిండాలు చెడిపోవడం వల్ల చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారని వివరించారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం కేజీహెచ్‌లోనే డయాలసిస్ జరిగిందన్నారు. తర్వాత మళ్లీ జైలుకి తరలించినట్లు చెప్పారు. శనివారం మళ్లీ సమస్య రాగా....ఆస్పత్రికి పంపినట్లు వివరించారు.
ఓం ప్రకాష్, స్వస్థలం చిత్తురు జిల్లా మదనపల్లె . నవంబర్ 9...2008న అనంతపురం జైల్లో... మొద్దు శీనును తలపై బండరాయితో మోది చంపాడు. ఓ లారీ చోరీ కేసులో శిక్ష అనుభవిస్తూ..మొద్దు శీనును హత్య చేశాడు. నేరం రుజువు కావడం వల్ల ...విశాఖ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓంప్రకాష్.... తల్లి అంత్యక్రియల కోసం ఏప్రిల్ 13న..పెరోల్‌పై మదనపల్లికి వెళ్లి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఓం ప్రకాష్ మృతదేహం కేజీహెచ్‌లో ఉందని అధికారులు తెలిపారు