విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన జాగరపు వెంకటరమణ... కేజీహెచ్ ఆస్పత్రిలో రోగిలా ప్రవేశించి, వైద్యుల చరవాణులను దొంగిలిస్తున్నాడు. ముగ్గురు బాధిత డాక్టర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న విశాఖ ఒకటో పట్టణ పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. వెంకటరమణ గతంలో చిల్లర దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడిపాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రోగిలా ప్రవేశించి... చరవాణుల తస్కరణ..! - విశాఖ నేర వార్తలు
రోగిలా ఆస్పత్రిలోనికి ప్రవేశించి, వైద్యుల చరవాణులను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని... విశాఖ ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారి