ప్రతీ జిల్లాకు కోవిడ్ ఖర్చుల నిమిత్తం కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి అవంతి శీనివాస్ అన్నారు. విశాఖ జిల్లాకు కేటాయించిన సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. జిల్లాకు 5 బస్సులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో అత్యధిక కోవిడ్ పరీక్షలు చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
ఇప్పటికే 12 లక్షలు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వాహనాలు సేవలను మారుమూల గ్రామాల ప్రజలు వినియోగించుకోవచ్చని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు.