భాజపా ఎమ్మెల్సీ మాధవ్ విశాఖ మన్యంలో పర్యటించారు. పాడేరు నియోజకవర్గంలోని బరిసింగి, డేగల వీధి గ్రామాలను సందర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మన్యంలో అమలవుతోన్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీశారు. నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు.
మన్యంలో పర్యటించిన ఎమ్మెల్సీ మాధవ్ - mlc madhav news
ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ విశాఖ మన్యంలో పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ఆరా తీశారు.
మన్యంలో పర్యటించిన ఎమ్మెల్సీ మాధవ్
తమకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు మాధవ్ దృష్టికి తెచ్చారు. అత్యవసర సమయాల్లో నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన ఆయన.. రహదారి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.