'సింహాచలం ఆలయ ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి' - ఎమ్మెల్సీ మాధవ్ లేటెస్ట్ వార్తలు
సింహాచలం ఆలయ ఈవోను భాజపా ఎమ్మెల్సీ మాధవ్ కలిశారు. తొలగించిన ఒప్పంద ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
!['సింహాచలం ఆలయ ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి' 'సింహాచలం ఆలయ ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8089345-4-8089345-1595177752384.jpg)
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/19-July-2020/8089345_4_8089345_1595177752384.png
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వమే ఆదుకుని విధుల్లోకి తీసుకోవాలని ఆలయ ఈవో భ్రమరాంబకు ఎమ్మెల్సీ మాధవ్ విజ్ఞప్తి చేశారు. కరోనా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు ఆర్థిక సమస్యలతో ఉన్నాయని... వాటిని సైతం ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పుకునే ప్రభుత్వo ఒప్పంద ఉద్యోగులను తొలగించటం మంచి పద్దతి కాదని హితవు పలికారు.