ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"త్వరలోనే భాజపాలోకి మరిన్ని చేరికలు" - mlc madhav comments on tdp

త్వరలోనే భాజపాలోకి మరిన్ని చేరికలు ఉంటాయని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయా శక్తి భాజపానే అని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ జోస్యం చెప్పారు.

త్వరలోనే భాజపాలోకి మరిన్ని చేరికలు:ఎమ్మెల్సీ మాధవ్

By

Published : Jun 21, 2019, 12:00 PM IST

త్వరలోనే భాజపాలోకి మరిన్ని చేరికలు:ఎమ్మెల్సీ మాధవ్


రాష్ట్రంలో ప్రత్యామ్నాయా శక్తిగా భాజపా ఎదుగుతోందని... వరదలా నాయకులు వచ్చి భాజపాలో చేరుతున్నారని, మరిన్ని చేరికలు త్వరలోనే ఉంటాయని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. విశాఖలో యోగా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన... చాలా మంది నేతలు భాజపాతో సంప్రదింపులు జరపుతున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ విధానాలు నచ్చి తెదేపా ఎంపీలు పార్టీలో చేరారని, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినా అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా నారా వారి తెదేపాగా మారిందని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details