ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 7, 2020, 8:55 AM IST

ETV Bharat / state

'వ్యాపార ప్రయోజనాల కోసమే .. విశాఖలో రాజధాని అంటున్నారు'

గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా స్వాగతించారని.. ఇప్పుడు యుటర్న్ ఎందుకు తీసుకున్నారని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ ప్రశ్నించారు. ఎవరి కోసం విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

mlc madhav comments on cm jagan
భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్

రాష్ట్ర రాజధాని విషయంలో రెండు పార్టీలు సవాలు విసురుకోవడం సరైన పద్ధతి కాదని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుపార్టీలు రాజధాని కోసం..... రాజీకి రావాలని ఆయన సూచించారు. రాజధాని అమరావతికి కోసం రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారని... చంద్రబాబునాయుడికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడే... విశాఖ ఆర్ధిక రాజధానిగా అవతరించిందని మాధవ్ అన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసమే.. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని వైకాపా నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.

లెబనాన్ పోర్ట్​లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు తరహా ప్రమాదం.. విశాఖకు పొంచి ఉందని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఒక్క విశాఖ పోర్ట్​లో మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు జరుగుతున్నాయని ..., ప్రభుత్వ యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటికే వరుస పరిశ్రమ ప్రమాదాలు జరుగుతున్నందున... ముందస్తుగానే భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి.రియా సహా ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్

ABOUT THE AUTHOR

...view details