ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ మాధవ్ - కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. విశాఖలో కరోనా పరీక్షలు నిర్వహించే పద్ధతి దారుణంగా ఉందని...ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ మాధవ్
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ మాధవ్

By

Published : Jul 28, 2020, 3:14 PM IST

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన... భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపారు.

విశాఖలో కరోనా పరీక్షలు నిర్వహించే పద్ధతి దారుణంగా ఉందని...ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. ట్రూనాట్ టెస్టింగ్ కేంద్రాలను పెంచాలని మాధవ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ బాధితుల నుంచి భారీగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టిక పెట్టాలన్నారు. 104, 108, సకాలంలో రాక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details