ఉపాధ్యాయుల కౌన్సెలింగ్లో అవకతవకలకు పాల్పడుతున్నారని.. పోస్టులు బ్లాక్ చేసి ఎమ్యెల్యేలు సొమ్ము చేసుకుంటున్నారని తెదేపా నేత బుద్దా వెంకన్న అన్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సమయంలో పారదర్శకంగా బదిలీలు జరిగాయని చెప్పారు. టీచర్లకు నష్టం చేకూర్చే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకూ జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: బుద్దా వెంకన్న - ఉపాధ్యాయుల బదిలీలపై బుద్దా వెంకన్న కామెంట్స్
విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు సైతం జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులకూ జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: బుద్దా వెంకన్న
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఇంటి పన్ను పెంచే చర్యలు చేసిందని చెప్పారు. శాసన మండలిలో ఇంటి పన్నుల పెంపు బిల్లు వ్యతిరేకించినా... అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారని అన్నారు. 2022లో జమిలీ ఎన్నికలు వస్తాయన్న బుద్దా వెంకన్న.. చంద్రబాబే తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
ఇదీ చదవండి:విజయవాడ నుంచి దిల్లీ బయలుదేరిన సీఎం జగన్