విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేఖర్ల సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం ఇచ్చిన 35 వేల ఎకరాలను అభివృద్ధి చేయకుండా... 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని... సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు వస్తే తట్టుకునే పరిస్థితులు లేవని వివరించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు తీసుకురావాలని సూచించారు. విశాఖలో పరిపాలనా విభాగం, కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. రాజధాని ఒకేచోట ఉంచి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని నాటకం' - అనకాపల్లిలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు వార్తలు
చంద్రబాబుపై కక్షతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని నాటకం ఆడుతున్నారని... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు
'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని నాటకం ఆడుతున్నారు'