ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ అరెస్టు - TNSF President Pranab Gopal arrest

విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ అరెస్టు
విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ అరెస్టు

By

Published : Mar 10, 2021, 1:54 PM IST

Updated : Mar 10, 2021, 4:43 PM IST

13:42 March 10

ఏ కారణం చేత అరెస్ట్​ చేశారంటున్న కార్యకర్తలు

విశాఖలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21వ వార్డు.. బూత్ నెంబర్ 15లో అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న తెలుగునాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రణవ్ గోపాల్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి అక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులు ఎమ్మెల్యేను కూడా అదుపులోకి తీసుకొని మూడో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు. 

వెలగపూడిని ఏ కేసులో అరెస్టు చేశారు? అన్న విషయాలను పోలీసులు ఎవరికీ చెప్పడం లేదు. మీడియాను కూడా ఆయనతో మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వెలగపూడి కారు మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లోనే ఉంది. ఎమ్మెల్యే అరెస్ట్ విషయం తెలుసుకున్న కార్యకర్తలు పోలీస్ స్టేషన్​కు తరలివస్తున్నారు. ఎమ్మెల్యేను ఏ కారణం చేత అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇదీ చూడండి.  
 లయోలా కళాశాలలో పోలింగ్​ని పరిశీలించిన.. ఎన్నికల కమిషనర్‌

Last Updated : Mar 10, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details