ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది: ఎమ్మెల్యే వెలగపూడి - mla velagapudi latest news

కరోనా విషయంలో ముఖ్యమంత్రి జగన్​, అధికారులకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు.

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

By

Published : May 19, 2021, 10:49 PM IST

కొవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ప్రజలు.. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రి జగన్​, అధికారులకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. సీఎం జగన్​.. కరోనాతో ప్రజలు సహజీవనం చేయాలంటారు. ఆయన మాత్రం ఇంటి నుంచి బయటకు రావట్లేదని ఎద్దేవా చేశారు.

విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి కిందటేడాది బకాయిల 70 శాతం మేర చెల్లించలేదని.. ప్రస్తుతం ఆక్సిజన్, మందులు కొరతతో కొవిడ్ బాధితులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ జిల్లాలో మరణాలను పరిశీలిస్తే .. రోజుకు ఎంత మంది చనిపోతున్నారో తెలుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చి తెలుగు ప్రజలకు కాపాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి..

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలకు కియా ఇండియా సాయం

ABOUT THE AUTHOR

...view details